తెలంగాణలో కోత్తగా 6,542 కేసులు, 20 మరణాలు
గత 24 గంటల్లో 6వేల 542 కేసులు నమోదు కాగా.. 20 మంది మృత్యువాత పడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 898 కేసులు నమోదయ్యాయి.;
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. రోజువారి కేసులు 6వేలు దాటాయి. గత 24 గంటల్లో 6వేల 542 కేసులు నమోదు కాగా.. 20 మంది మృత్యువాత పడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 898 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 570, రంగారెడ్డిలో 532, నిజామాబాద్‌లో 427, సంగారెడ్డిలో 320, నల్గొండలో 285, వరంగల్ అర్బన్ జిల్లాలో 244 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 18 వందల 76 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 46 వేల 488 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం 3 లక్షల 67 వేల మందికి కరోనా సోకింది.