Hyderabad: మోతినగర్‌లో యువతి హల్‌చల్.. బేకరీ సిబ్బందిపై..
Hyderabad: హైదరాబాద్ మోతినగర్‌లో ఓ యువతి హల్‌చల్ చేసింది. ఓ బేకరీలో వీరంగం సృష్టించింది.;
Hyderabad: హైదరాబాద్ మోతినగర్‌లో ఓ యువతి హల్‌చల్ చేసింది. ఓ బేకరీలో వీరంగం సృష్టించింది. అక్కడున్న కస్టమర్లను ఇష్టం వచ్చినట్లు తిట్టి... వారిపై తినుబండారాలను విసిరింది. ఎంత సర్థిచెప్పినా.. మాట వినకుండా బేకరీ సిబ్బందిపై కూడా తిట్లతో విరుచుకుపడింది.
దీంతో అక్కడున్నవారు 100కు డైల్ చేసి సమాచారం ఇచ్చారు. ఆమెను నిలుపుదల చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా... తిరగబడింది. దీంతో ఆమెను బలవంతంగా కారు ఎక్కించి... ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.