Telangana News : ఈశ్వరాచారిలా ఎవరూ చేయొద్దు..!

Update: 2025-12-07 08:15 GMT

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం ఈశ్వరా చారి చనిపోయారు. ఆయన మరణం వల్ల ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు వస్తాయా రావు కదా. అసలు బీసీ రిజర్వేషన్లు వస్తే లాభపడేది రాజకీయా నేతలు. సామాన్య ప్రజలకు పెద్దగా ఒరిగేదేం ఉండదు. చనిపోయిన వారిని రాజకీయాలకు వాడుకుంటారు తప్ప.. మృతుల ఫ్యామిలీలను ఎవరు ఆదుకుంటారు. ఎవరైనా సాయం చేస్తారా అంటే చేయరు. వారికి ఏమైనా గుర్తింపు లభిస్తుందా అంటే అది కూడా ఉండదు. ఎందుకంటే గతంలో ఎన్నో పోరాటాల్లో ఇలా చనిపోయిన వారికి ఏం గౌరవం, గుర్తింపు దక్కుతుందో మనం చూస్తున్నాం కదా. తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది చనిపోయారు. ఇప్పుడు వాళ్లు ఎక్కడున్నారు. వాళ్లకు ఏమైనా గుర్తింపు లభించిందా.

పోనీ వాళ్ల కుటుంబ సభ్యులకు ఏమైనా పదవులు ఇచ్చారా. కనీసం నామినేటెడ్ పోస్టులు కూడా వారికి ఇవ్వలేదు కదా. ఇంట్లో పెద్దదిక్కును కోల్పోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుంది. ఎవరికో పదవులు రావడం కోసం మీరు చనిపోవద్దు. ప్రాణం విలువ చాలా గొప్పది. మీరు చనిపోతే మీ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. అంతే తప్ప మీకు ఒరిగేదేం ఉండదు. ఈ విషయాలను ఆత్మబలిదానాలు చేసుకునే ముందు ప్రతిఒక్కరూ ఆలోచిస్తే మంచిది. ఇప్పుడు ఈశ్వరాచారి చనిపోతే అతనికి ఏమైనా లాభం ఒచ్చిందా. పార్టీలు అతని మరణాన్ని రాజకీయాల కోసం వాడుకుంటాయి.

అంతేగానీ ఆయన కుటుంబానికి ఒచ్చేదేం ఉండదు. ఆయన తల్లిదండ్రులు, ఇతర కుటుంబం మొత్తం దిక్కులేని పరిస్థితుల్లో ఉంటుంది కదా. స్వాతంత్య్ర పోరాటంలో చనిపోయిన వారికే ఎలాంటి గుర్తింపు లేదు. అలాంటిది బీసీ రిజర్వేషన్ల కోసం ఈశ్వరాచారి చనిపోతే వచ్చే గుర్తింపు ఏమైనా ఉంటుందా. ఆయన చావు వల్ల రిజర్వేషన్లు సాధ్యం అవుతాయా. అది అసభవం అని తెలిసినప్పుడు.. అది వచ్చినా లాభపడేది బీసీ రాజకీయ నేతలే అయినప్పుడు.. సామాన్య జనాలు ఎందుకు చచ్చిపోవాలి. కాబట్టి యువత ఈ విషయంలో ఆలోచించాలి. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అంటున్నారు రాజకీయ నిపుణులు.

Tags:    

Similar News