నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి.. సిగరెట్ తాగేందుకు వెళ్లి..!
హైదరాబాద్‌లో ఓ వ్యక్తి నాలాలో కొట్టుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.;
హైదరాబాద్‌లో ఓ వ్యక్తి నాలాలో కొట్టుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ రాయల్ వైన్స్ వద్ద మోహన్‌రెడ్డి అనే వ్యక్తి ఈనెల 25న నాలాలో పడిపోయాడు. స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లే సమయంలో భారీ వర్షం రావడంతో రోడ్డు పక్కన ఆగారు. మోహన్‌రెడ్డి మాత్రం సిగరెట్ తాగేందుకు నాలా వైపు వెళ్లి.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. స్నేహితులు మోహన్‌రెడ్డిని పట్టుకునే లోపే నాలాలో కొట్టుకుపోయాడు. మోహన్‌రెడ్డి నాలాలో పడిపోతున్న విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.