Petrol Rates : పెట్రోల్ ఎఫెక్ట్...బైక్ అమ్మేసి..గుర్రం పైనే..!

రోజు రోజుకు భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. పెరిగిన ధరలతో నిత్యావసరాల కోసం బైక్‌లు నడపాలంటేనే ఒక్కింత ఆలోచించే పరిస్థితి.

Update: 2021-10-13 13:26 GMT

రోజు రోజుకు భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. పెరిగిన ధరలతో నిత్యావసరాల కోసం బైక్‌లు నడపాలంటేనే ఒక్కింత ఆలోచించే పరిస్థితి. ఇలాంటి తరుణంలో...పెట్రోల్‌ బండి నడపలేక....ఓ వ్యక్తి చేసిన ఆలోచన అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. గుర్రం స్వారీతో ప్రయాణాలు చేస్తున్న జోగులాంబ జిల్లా గద్వాలకు చెందిన నర్సింహులు తీరును చూసి అందరు ఔరా అంటున్నారు.

పెట్రోల్ ధర భారం కావటంతో తనకు ఉన్న బైక్‌ను అమ్మేశాడు ముల్కలపల్లికి చెందిన నర్సింహులు. చుట్టుపక్కల పల్లెలకు వెళ్లాలంటే...ఇక గుర్రమే సరైన దారని భావించాడు. రెండేళ్ల కిందట కడప జిల్లా ప్రొద్దుటూరులో.. 22 వేలకు కొనుగోలు చేసిన గుర్రంపైనే నిత్యం పొలం పనులకు, పల్లెలకు ప్రయాణాలు చేస్తున్నాడు.

గుర్రం స్వారీతో ఖర్చుల భారంగా తగ్గిందంటున్న నర్సింహులు తన చిన్ననాటి నుంచి కలకూడ నెరవేరిందని చెబుతున్నాడు. నిత్యం గుర్రంపైనే ప్రయాణిస్తుండటంతో స్థానికంగా తన పేరు గుర్రం నర్సింహులుగా మారిందని నవ్వుతూ తెలిపాడు.

Tags:    

Similar News