తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రంలో బలంగా పాతుకుపోవాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలతో గ్రౌండ్ లెవల్లో పాతుకుపోయింది. అదే ఇప్పుడు ఆ పార్టీకి ప్లస్ గా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాంటి పనులే చేయాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవల్లో నుంచే ఎలా బలంగా తయారు చేయాలనే దానిపై వాళ్లకు శిక్షణలు ఇస్తున్నారు. దీనికి ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా రాహుల్ గాంధీని కూడా తీసుకొస్తున్నారు. ఇలా కాంగ్రెస్ భావజాలాన్ని వారిలో పెంచి.. గ్రౌండ్ లెవల్ నుంచే దాన్ని అప్లై చేయాలని భావిస్తున్నారు కాంగ్రెస్ అగ్ర నేతలు. భవిష్యత్ లో తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంటే.. అప్పుడు లీడర్లు మారినా సరే కార్యకర్తల అండ గట్టిగానే ఉంటుంది పార్టీకి.
ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది కూడా ఇదే. అందులో భాగంగానే డీసీసీ అధ్యక్షులను ఏరికోరి మరీ సెలెక్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొన్న కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల కోసం ప్రతి జిల్లాలో భూములను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ స్థలాల్లో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత బిల్డింగులు కట్టిస్తే.. ఎప్పటికీ ఆ ముద్ర పడిపోతుందని అధిష్టానం భావిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడే పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు.
డీసీసీ అధ్యక్షులు సొంత ఇమేజ్ కోసం కాకుండా పార్టీ ఇమేజ్ ను పెంచడానికే ప్రయత్నించాలి అనేది మేజర్ కండీషన్. ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా సమాధానాలు ఇవ్వాలని.. బలంగా పోరాడి ప్రజల్లో ముద్ర పడేలా చూడాలన్నది వారికి ఇచ్చిన కండీషన్ అని తెలుస్తోంది. బీజేపీ లీడర్లు ఎంత బలంగా పోరాడుతున్నారో.. అంతకు మించి పార్టీ సిద్ధాంతాల కోసం డీసీసీ అధ్యక్షులు పోరాడాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. దాన్ని తెలంగాణ నుంచే మొదలు పెడుతున్నారంట. మరి ఎలాంటి రిజల్ట్ ఉంటుందో చూడాలి.