Warangal: జాయినింగ్ రిపోర్ట్ తెచ్చుకుంటానని వెళ్లి ఉపాధ్యాయుడి ఆత్మహత్య..
Warangal: తెలంగాణలో ఉద్యోగ బదిలీలు మరో ఉపాధ్యాయుడి ప్రాణాలను బలితీసుకుంది.;
Warangal: తెలంగాణలో ఉద్యోగ బదిలీలు మరో ఉపాధ్యాయుడి ప్రాణాలను బలితీసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ఉప్పల రమేష్.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 317జీవో ద్వారా వరంగల్‌జిల్లా నుంచి ములుగు జిల్లాకు శ్వాశ్వతంగా బదిలీ కావడంతో.. మనోవైదనకు గురై రమేష్ ఆత్మహత్య చేసుకున్నారు. ములుగులో జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన రమేష్.. మార్గం మధ్యలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.