Hyderabad: అత్తింటి ముందు మహిళ నిరసన.. లగేజీ బయట పడేసి ఇంటి నుండి గెంటివేయడంతో..
Hyderabad: హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని అత్తింటి ముందు ఓ మహిళ నిరసనకు దిగింది.;
Hyderabad: హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని అత్తింటి ముందు ఓ మహిళ నిరసనకు దిగింది. లగేజీ బయట పడేసి ఇంటి నుండి గెంచివేయడంతో పాటు ఇంటికి తాళం వేసుకుని వెళ్లారు అత్తామామలు. దీంతో గత్యంతరం లేని మహిళ... అత్తింటి ముందే న్యాయం చేయాలంటూ బైఠాయించింది. ఏలూరుకు చెందిన గౌరీకి, అశోక్‌నగర్‌కు చెందిన శ్రీకృష్ణకు 2019లో వివాహమైంది. అప్పటి నుంచి అదనపు వరకట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని మహిళ ఆరోపించింది. తన నుంచి భర్తను దూరం చేసి వేరేగా ఉంచారని వాపోయింది. తన భర్తతో కలిసి ఉండేలా న్యాయం చేయాలని యువతి వేడుకుంటోంది.