ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సందేశంతో ఆలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలిపారు. వచ్చేనెల 3న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగనున్న అలయ్- బలయ్ కార్యక్రమ నిర్వహణ పనులను బండారు దత్తాత్రేయ పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలిపారు.