ACB Notices To KTR : కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. ఎల్లుండే విచారణ

Update: 2025-01-04 12:45 GMT

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని కోరింది. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులిచ్చింది. 8న ఏ2 అరవింద్కుమార్, 10న ఏ3 బీఎల్ఎన్ రెడ్డిలనకు విచారణకు రావాలని కోరింది. ఇదే కేసులో ఈనెల 7న హాజరుకావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ మాత్రం విచారణకు రాలేమంటూ ఈడీ ఉన్నతాధికారికి మెయిల్ కు పంపించారు. సంక్రాంతి వరకు గడువు కోరారు. వీరి అభ్యర్థనను తోసిపుచ్చిన ఈడీ ఈనెల 8,9 తేదీలలో తప్పకుండా హాజరుకావాలని మళ్లీ సమన్లు ఇచ్చింది. ఈ కేసు ఫిర్యాదుదారుడైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నుంచి ఏసీబీ కీలక సమాచారం సేకరించింది. వాటి ఆధారంగా ఈ కేసులో నిందితులకు ప్రశ్నించేందుకు ఏసీబీ సమాయత్తమౌతోంది. కార్ రేస్ కేసులో ఎవరి ఆదేశాలతో నిధులు విడుదల చేశారు? ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్ఎండీఏ రికార్డులపై ఏసీబీ అధికారులు ఏ2,ఏలిలను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని కేటీఆర్ వెల్లడించడంతో అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించిన ఏసీబీ ఆయా అంశాలపై భారత నేతను ప్రశించే అవకాశముంది.

Tags:    

Similar News