లైంగికదాడి కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం కోర్టు తీర్పు చెప్పింది. హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలోని సరూర్ నగర్ ఉండే మైనర్ పై.. అదే ప్రాంతంలో నివాసం ఉండే అంజయ్య అనే వ్యక్తి కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు వచ్చాక బాలిక అసలు విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాజాగా.. జీవిత ఖైదుతో పాటు కోర్టు రూ.30 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో పాటు బాధితురాలికి రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.