విచారణకు న్యాయవాదిని అనుమతించడం కుదరదని కేటీఆర్ కు ఇచ్చిన 2వ నోటీసులో ఏసీబీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘న్యాయవాది సమక్షంలో విచారణ కోరడం నిబంధనలకు విరుద్ధం. లాయర్‌ను అనుమతించలేదనే సాకుతో విచారణ తప్పించుకుంటున్నారు. విచారణ తర్వాత మీ సమాధానం ఆధారంగా ఏ డాక్యుమెంట్లు తీసుకురావాలనేది చెబుతాం. వాటిని సమర్పించేందుకు సమయం ఇస్తాం. విచారణకు సహకరించకపోతే తదుపరి చర్యలు తప్పవు’ అని పేర్కొంది.
మరోవైపు ఫార్ములా-ఈ కేసులో HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. పలు డాక్యుమెంట్లతో హాజరైన ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రూ.45.71కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. మరోవైపు ఇదే వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. రూ.7,380 కోట్ల ORR టోల్ టెండర్లలో అవినీతి జరిగిందని వనపర్తి జిల్లా వాసి యుగంధర్ ఫిర్యాదు చేశారు. క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే వ్యవహారంపై కేటీఆర్ తో పాటు కేసీఆర్ పైనా ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.