TG Inter Supplementary : మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

Update: 2025-04-22 13:45 GMT

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 3 నుంచి 6 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీతో పాటు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా పక్కా ప్రణాళికతో ఎక్కడా పొరపాట్లు జరగకుండా వ్యాల్యుయేషన్ జరిగిందని బోర్డు పేర్కొంది. కాగా ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వచ్చేశాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు.

ఇంటర్ ఫలితాల్లో HEC, CEC గ్రూప్ విద్యార్థులు నిరాశపరిచారు. ఫస్టియర్ HECలో 8959 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 3092 మందే (34.51%) పాసయ్యారు. CECలో 92745 మంది హాజరైతే 42259 మంది (45.56%) ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండియర్ HECలో 9031 మంది రాస్తే 4178 మంది (46.26%), CECలో 103713 మంది హాజరైతే 48658 మంది (46.92%) పాస్ అయ్యారు.

ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. పాసైనవాళ్లు సంబరాలు చేసుకుంటే.. ఫెయిలయ్యామని, మార్కులు తక్కువొచ్చాయని కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు భావించకండి. ఇప్పుడు తప్పితే.. సప్లీ అనే సెకండ్ ఆప్షన్ ఉంది. కానీ, తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. మీరే ప్రాణంగా బతికే మీ వాళ్ల జీవితకాలపు కన్నీళ్లకు కారకులవుతారు. తప్పడం తప్పు కాదని గ్రహించి.. సప్లీలో పాసై కాలర్ ఎగరేయండి.

Tags:    

Similar News