AI City : హైదరాబాద్‌లో 200 ఎకరాల్లో ఏఐ సీటీ

Update: 2024-07-19 05:00 GMT

హైదరాబాద్ లో 200 ఎకరాల్లో 'ఏఐ' - ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ ఏర్పాట్లు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే 20 ఏళ్లకు సంబంధించి ప్రభుత్వ పాలన, పారిశ్రామిక రంగాల్లో కృత్రిమ మేధ వినియోగంపై ఒక రోడ్ మ్యాప్ ను రూపొందించనున్నట్లు చెప్పారు.

గురువారం నాడు బ్రిటిష్ హై కమిషన్, ఇ అండ్ వై ప్రతినిధులతో ఆయన సచివాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఏఐ సిటీలో బ్రిటిష్ హై కమిషన్, ఎర్నెస్ట్ సంస్థలు కీలక భాగస్వాములు కావాలని శ్రీధర్ బాబు అభిలాషించారు. కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీల్లో బ్రిటిష్ హై కమిషన్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేసారు. సైబర్ సెక్యూరిటీలో శిక్షణ, అవగాహన కార్యక్రమా లు నిర్వహించడానికి హై కమిషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.

గ్లోబల్ సామర్ధ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంలో సహకరించాలని శ్రీధర్ బాబు వారిని కోరారు. ఈ సమావేశంలో బ్రిటిష్ హై కమిషనకు చెందిన లారా బాల్డ్ విన్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతినిధులు వికాస్ అగర్వాల్, నవీన్ కౌల్, కిరణ్ వింజమూరి, రాష్ట్ర ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్ వేణు ప్రసాద్ తది తరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News