Huge Fine for Airlines : విమానంలో బ్యాగ్ మిస్.. ఎయిర్ లైన్స్ కు భారీగా ఫైన్

Update: 2024-08-13 12:30 GMT

ఓ ప్రయాణికుడి బ్యాగ్ విమానంలో మిస్సవడంతో ఇండిగో, ఖతార్ ఎయిర్ లైన్స్ కు హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జరిమానా విధించింది. సదరు ప్యాసింజర్ కు రూ.3.72లక్షలు చెల్లించాలని ఆదేశించింది.

తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీఎస్ ఈఆర్సీ) చైర్మన్ రంగారావు గత జూలైలో అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి దోహా మీదుగా హైదరాబాద్ వచ్చేలా టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే తన బ్యాగులో ఉన్న విలువైన వస్తువుల విషయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేయగా మీ వస్తువులు ఎక్కడా తప్పిపోకుండా తాము క్షేమంగా హైదరాబాద్ కు తీసుకువస్తామని ఇండిగో హామీ ఇచ్చింది.

దీంతో రూ.3.54 లక్షల విలువైన వస్తువులున్న బ్యాగ్ ను వారికి అప్పగించారు. తీరా రంగారావు హైదరాబాద్ చేరుకునేసరికి తన బ్యాగ్ మిస్ అయింది. దీంతో ఆయన కన్జూమర్ ఫోరంను ఆశ్రయించగా ఎయిర్ లైన్స్ కు జరిమానా విధించింది.

Tags:    

Similar News