ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమని.. తాను పెద్దగా చదువుకోలేదని ఈ సభలో అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడనని ఎఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ‘నేను డాక్టర్ కావాలనుకున్నా. కానీ ఎంబీబీఎస్ కోర్సును మధ్యలోనే వదిలేశాను. ఆ బాధేంటో నాకు తెలుసు’ అంటూ ఎమోషనల్ అయ్యారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందన్నారు. విద్యారంగంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను చెల్లించాలన్నారు. ‘సోషియో ఎకనమిక్ సర్వే ప్రకారం మన దేశంలో అక్షర్యాసత 77 శాతం. తెలంగాణలో 65 శాతంగా ఉంది. దాదాపు 17 లక్షల మంది పిల్లలు చదువు మధ్యలోనే మానేశారు. ఇది చాలా బాధాకరం. పిల్లలను మళ్లీ బడులకు తీసుకురావడానికి పార్టీలకతీతంగా కృషి చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్. అసెంబ్లీలో సభాధ్యక్షుడిగా ఆయనను చూడడం చాలా సంతోషంగా ఉంది’ అని అక్బరుద్దీన్ అన్నారు