Akbaruddin Owaisi : లా అండ్ ఆర్డర్ ఎక్కడ..? రేవంత్ సర్కార్‌పై అక్బరుద్దీన్ ఓవైసీ ఫైర్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని, రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ధ్వజమెత్తారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు.హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ సమస్య గురించి నిన్న నేను, హరీష్ రావు మాట్లాడితే లా అండ్ ఆర్డర్ బాగుంది అని మంత్రి పేర్కొన్నారు. మళ్లీ నిన్న నగరంలో 3 హత్యలు చోటు చేసుకున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల పని నేరస్థులను పట్టుకోవడం కానీ వాళ్లు రాత్రి పూట సామాన్యుల మీద లాఠీఛార్జ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో పోలీసులు రాత్రిపూట డ్యూటీలు చేస్తూ పగటి పూట పడుకుంటున్నారు. దీంతో హత్యలు పగటిపూట జరుగుతున్నాయని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.