Heavy Rains : తెలంగాణకు అలెర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు

Update: 2025-09-02 06:30 GMT

భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ వర్షాల ప్రభావం ఇలాగే కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చెయ్యడంతో అధికార యంత్రాంగం అలెర్ట్ అయింది. తెలంగాణ లోని పలు జిల్లాలలో కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

తాజా వివరాల ప్రకారం ... రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ జిల్లాలలో కుండపోత వానలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అంతే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు వర్ష ప్రభావం కొనసాగనున్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News