Amit Shah Ramoji Rao : రామోజీరావుతో అమిత్‌షా భేటీ.. దాని పైనే తీవ్ర చర్చ..
Amit Shah Ramoji Rao : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా భేటీ అయ్యారు.;
Amith Shah Ramoji Rao : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా భేటీ అయ్యారు. మునుగోడు సభ ముగిసిన అనంతరం ఆయన నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. రామోజీరావు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. తర్వాత రామోజీరావుతో అమిత్ షా, కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దాదాపు 45 నిమిషాల పాటు రామోజీ రావు, అమిత్‌షా భేటీ జరిగింది.