Amit shah : కేసీఆర్‌ను గద్దె దించడానికి బండి సంజయ్ ఒక్కడు చాలు : అమిత్ షా
Amit shah : టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ సమరశంఖం పూరించింది. తక్కుగూడ ప్రజా సంగ్రామ సభలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా...;
Amit shah : టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ సమరశంఖం పూరించింది. తక్కుగూడ ప్రజా సంగ్రామ సభలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా... కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి బండి సంజయ్ ఒక్కడు చాలన్నారు. అన్ని వర్గాల ఆకాంక్షలను, హైదరాబాద్ నిజాంను మార్చే యాత్రగా అభివర్ణించారు. మజ్లీస్ తొత్తుగా మారిన కేసీఆర్‌ను, మజ్లీస్‌ను ఒకేసారి తరిమికొడదామని పిలుపునిచ్చారు. కొడుకు, కూతురు కోసమే స్కాంలు చేస్తున్నారని, ఇంకెంత దోచుకుంటారని అమిత్‌షా ప్రశ్నించారు. ఇంత అనినీతి ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడలేదని ఫైరయ్యారు. నీళ్లు నిధులు, నియామకాలంటూ హామీ ఇచ్చిన కేసీఆర్ ఒక్కటీ నెరవేర్చలేదని... బీజేపీకి అధికారం కట్టబెడితే వాటిని మేమే నెరవేరుస్తామన్నారు. కేసీఆర్‌ను తరిమికొట్టడానికి మాయామంత్రాలు అవసరం లేదని, తెలంగాణ యువతే ఆ పనిచేయబోతోందన్నారు.