Amit Shah : తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్‌షా భేటి..
Amit Shah : మునుగోడు ఉప ఎన్నిక, పార్టీ బలోపేతంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు;
Amit Shah : మునుగోడు ఉప ఎన్నిక, పార్టీ బలోపేతంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు. బేంగంపేట్‌లోని హరిత ప్లాజాలో రాష్ట్ర ముఖ్యనేతలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్‌తో పాటు 19మంది నేతలు హాజరయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పలు అంశాలపై రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. మూకుమ్మడిగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.