ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చేసిన ఫిర్యాదును పక్కన బెట్టి చార్జిషీట్ నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ దాఖలు చేసిన పిటిషన్ ను నాంపల్లి 8 వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సోమవారం విద్యా రించారు. నిరంజన్ తరఫున న్యాయవాది సామా సునీల్ రెడ్డి వాదనలు వినిపించారు.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా మే 1న శాలిబండలోని సుధాటాకీస్ వద్ద జరిగిన ఎన్నికల ర్యాలీలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చిన్నపిల్లలను పక్క నబెట్టుకుని అమిత్ షా ఎన్నికల ప్రచారం చేశారని ఆయన కోర్టుకు నివేదించారు. మొఘల్పురా పోలీస్ స్టేషన్లో తాము చేసిన ఫిర్యాదు మేరకు అమిత్ షా, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, లోక్సభ అభ్యర్థి మాధవీలత, యమన్ సింగ్ లపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. చార్జిషీట్లో అమిత్ షా, కిషన్ రెడ్డి పేర్లు తొలగించడం సబబు కాదని, తాము చేసిన ఫిర్యాదు మేరకు అమిత్ షా, కిషన్ రెడ్డిలపై చార్జిషీట్ నమోదు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.
వాదనలు విన్న న్యాయస్థానం విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది.