Amit Shah : ఈనెల 14న ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ.. హాజరుకానున్న అమిత్ షా
Amit Shah : ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభను ఈనెల 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ సమీపంలో కనీవినీ ఎగరని రీతిలో నిర్వహించనున్నట్లు చెప్పారు.;
Amit Shah : ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభను ఈనెల 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ సమీపంలో కనీవినీ ఎగరని రీతిలో నిర్వహించనున్నట్లు చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ముగింపు సభతో చరిత్ర సృష్టిద్దామని బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్న ఈ సభను మార్పుకు సంకేతంగా నిర్వహించనున్నట్లు బండి సంజయ్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లతో పాటు పోటీచేసిన ఓడిన కార్పొరేట్ అభ్యర్థులతో బండి సంజయ్ సమావేశమమై.. అమిత్ షా హాజరుకానున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఏర్పాట్లు, జనసమీకరణ అంశాలపై చర్చించారు. పాలమూరుతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు టీఆర్‌ఎస్ పాలనపట్ల విసిరిపోయారని, వారంతా మార్పును కోరుకుంటున్నారని బండి సంజయ్ చెప్పారు.