Amith Shah : అమిత్‌షా హైదరాబాద్ టూర్..
Amith Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారైంది;
Amith Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. రేపు రాత్రి 9 గంటల 50 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి శివరాంపల్లి పోలీస్ అకాడమీలో బస చేయనున్నారు. ఇక 17న ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లనున్న అమిత్ షా.. ఉదయం 8.45 నుంచి 11.45 గంటల వరకు పరేడ్ గ్రౌండ్‌లో జరిగే తెలంగాణ విమోచన వజ్రోత్సవాల్లో ప్రసంగిస్తారు.
ఇక పరేడ్ గ్రౌండ్ నుంచి బేగంపేటలోని టూరిజం ప్లాజాకు వెళ్లనున్నారు అమిత్ షా. టూరిజం ప్లాజాలో బీజేపీకోర్ కమిటీ సమావేశంలో పార్టీ నేతలకు మునుగోడు బైపోల్, సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌కు చేరుకుంటారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన వికలాంగులకు ఉపకరణాల పంపిణీ చేస్తారు.
అక్కడి నుంచి సాయంత్రం శివరాంపల్లి పోలీస్ అకాడమీకి వెళ్లనున్న అమిత్ షా.. పోలీస్ అకాడమీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి 17న రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు అమిత్ షా.