Raghunandan Rao : ప్రధానిపై బురదజల్లే ప్రయత్నం.. రఘునందన్ రావు విసుర్లు
కాంగ్రెస్ పార్టీ అబద్దపు ప్రచారాలతో ప్రధాని మోదిని బదనాం చేస్తోందని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ రఘునందన్ రావు మండి పడ్డారు. ఆదానీ సంస్థలు చేసిన అక్రమాలతో ప్రధాని మోదీకి ఏంటి సంబంధం అని ప్రశ్నిం చారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కూడా ఆదానీ
సంస్థతో కలిసి రాష్ట్రా నికి పెట్టుబడులు తెస్తున్నారని, ఈ నేపథ్యంలో సీఎం రేవంత్పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. అమెరికాలో వెలుగు చూసిన ఆదానీ అక్రమాలపై అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేశంలోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరోపణలు చేశారని, అందులో ఒక్కటి కూడా బీజేపీ పాలిత రాష్ట్రం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ విషయమై శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో డీఎంకే, ఏపీలో వైఎస్ఆర్సిపీ, ఓడిశాలో బిజూ జనతాదల్, చత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధి కారంలో ఉందని గుర్తుకు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రా లు, ఆయా రాష్ట్రా ల ముఖ్యమంత్రులు ఆదానీతో వ్యాపార ఒప్పందాలు చేసుకోకపోతే చత్తీస్ గఢ్ నాడు కాంగ్రెస్ ప్రభు త్వం సీఎం చేసుకున్న ఒప్పందం ఏంటో బయటపెట్టాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు