LB Nagar: కన్నకొడుకే ఇంటి నుంచి తరిమేశాడు.. వృద్ద దంపతుల ఆవేదన..
LB Nagar: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలో వృద్ద దంపతులు న్యాయ పోరాటానికి దిగారు.;
LB Nagar: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలో వృద్ద దంపతులు న్యాయ పోరాటానికి దిగారు. కన్నకొడుకే ఇంటి నుంచి తరిమేశాడని జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. చీకటి గదిలో బంధించి..చిత్రహింసలకు గురిచేస్తున్నారని కలెక్టర్ ఎదుట కన్నీమున్నీరయ్యారు వృద్ధులు. కుటుంబ సభ్యుల తీరుపై మండిపడ్డ కలెక్టర్...తక్షణమే ఇంటిని వృద్ధులకు అప్పజెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. పర్యవేక్షణకుగాను రాచకొండ సీపీ, ఆర్డీవోలకు ఆదేశాలిచ్చారు. వృద్ధులతో కలిసి రెవెన్యూ, పోలీసులు చేరుకునేలోపు ఇంటికి తాళం వేసిన కొడుకు, కోడలు.. అక్కడి నుంచి జారుకున్నారు.