ANDESRI: అశ్రు నయనాలతో అందెశ్రీకి అంతిమ వీడ్కోలు

పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి

Update: 2025-11-11 10:05 GMT

ప్ర­ముఖ కవి, రా­ష్ట్ర గేయ రచ­యిత అం­దె­శ్రీ అం­త్య­క్రి­య­లు ఘట్‌­కే­స­ర్‌­లో ప్ర­భు­త్వ అధి­కా­రిక లాం­ఛ­నా­ల­తో పూ­ర్త­య్యా­యి. ఈ అం­తిమ సం­స్కా­రా­ల­కు తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి­తో పాటు పలు­వు­రు మం­త్రు­లు, ఎమ్మె­ల్యే­లు, ఇతర ప్ర­జా­ప్ర­తి­ని­ధు­లు హా­జ­ర­య్యా­రు. అం­త్య­క్రి­య­ల్లో పా­ల్గొ­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి స్వ­యం­గా కవి అం­దె­శ్రీ పా­డె­ను మో­శా­రు. అం­దె­శ్రీ పట్ల తన­కు­న్న గౌ­ర­వా­న్ని, ప్రే­మ­ను చా­టు­కు­న్నా­రు. అం­దె­శ్రీ కు­టుం­బ­స­భ్యు­లు, బం­ధు­వు­లు, సన్ని­హి­తు­లు, ఆయన అభి­మా­ను­లు పె­ద్ద సం­ఖ్య­లో అం­త్య­క్రి­య­ల్లో పా­ల్గొ­ని కడ­సా­రి వీ­డ్కో­లు పలి­కా­రు. అం­త­కు­ముం­దు లా­లా­పే­ట్‌ నుం­చి తా­ర్నాక, ఉప్ప­ల్‌ మీ­దు­గా ఘట్‌­కే­స­ర్‌­లో­ని ఎన్‌­ఎ­ఫ్‌­సీ నగ­ర్‌ వరకు అం­దె­శ్రీ అం­తి­మ­యా­త్ర కొ­న­సా­గిం­ది.అనం­త­రం పో­లీ­సు లాం­ఛ­నా­ల­తో ప్ర­భు­త్వం అధి­కా­రి­కం­గా అం­దె­శ్రీ అం­త్య­క్రి­య­లు ని­ర్వ­హిం­చి ప్ర­జా­క­వి­ని సా­గ­నం­పిం­ది.


పో­లీ­సు­లు మూ­డు­సా­ర్లు గా­లి­లో­కి కా­ల్పు­లు జరి­పిన తర్వాత అం­తిమ సం­స్కా­రా­లు ని­ర్వ­హిం­చా­రు. ఉదయం సీ­ని­య­ర్‌ నేత కే­శ­వ­రా­వు­తో పాటు మం­త్రు­లు పొ­న్నం ప్ర­భా­క­ర్‌, సీ­త­క్క­తో పాటు సీ­ని­య­ర్‌ నేత వీ­హె­చ్‌­లు అం­దె­శ్రీ పా­ర్థివ దే­హా­ని­కి ని­వా­ళు­ల­ర్పిం­చి అం­తిమ యా­త్ర­లో పా­ల్గొ­న్నా­రు. లా­లా­పే­ట్‌ నుం­చి తా­ర్నాక, ఉప్ప­ల్‌ మీ­దు­గా ఘట్‌­కే­స­ర్‌­లో­ని ఎన్‌­ఎ­ఫ్‌­సీ నగ­ర్‌ వరకు అం­తి­మ­యా­త్ర కొ­న­సా­గిం­ది. అభి­మా­ను­లు, సా­హి­తీ ప్రి­యు­లు వే­లా­ది సం­ఖ్య­లో తర­లి­వ­చ్చా­రు. 500 మంది కళా­కా­రు­లు యా­త్ర సా­గు­తు­న్నం­త­సే­పు ఆడి­పా­డా­రు. అమర్ రహే అందె శ్రీ అంటూ కడ­సా­రి కన్నీ­టి వీ­డ్కో­లు పలి­కా­రు. అభి­మా­నుల ఆశ్రు­న­య­నాల నడుమ అం­త్య­క్రి­య­లు ము­గి­శా­యి.  అం­దె­శ్రీ సో­మ­వా­రం గుం­డె­పో­టు­తో మర­ణిం­చా­రు. ఇం­ట్లో­నే తీ­వ్ర అస్వ­స్థ­త­కు గు­ర­య్యా­రు. వాష్ రూమ్ దగ్గర పడి­పో­యా­రు. గు­ర్తిం­చిన కు­టుంబ సభ్యు­లు గాం­ధీ ఆసు­ప­త్రి­కి తర­లిం­చా­రు. అప్ప­టి­కే ఆయన గుం­డె­పో­టు­తో మృతి చెం­ది­న­ట్టు­గా వై­ద్యు­లు తె­లి­పా­రు.

Tags:    

Similar News