Kavitha and KTR : అన్నా..ఏం చేద్దాం... కేటీఆర్‌తో కవిత సుదీర్ఘ మంతనాలు

Update: 2025-01-08 08:30 GMT

మంగళవారం క్వాష్ ఫిటిషన్ ను హైకోర్టు కొట్టి వేయడంతో కేటీఆర్ ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, న్యాయ పరమైన అంశాలపై అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. నంది నగర్ నివాసంలో కేటీఆర్ ఎమ్మెల్సీ కవితతో అత్యవ సరంగా భేటీ అయ్యారు. ఫార్ములా కేసు పరిణామాలపై చర్చించారు. లీగల్ టీమ్ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టి వేయడం, ఈడీ విచారణకు కేటీఆర్ సమయం కోరడం ఏసీబీ 9న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన అంశాలపై ఎలా ముందకు వెళ్ళాలి అనే విషయాలపై న్యాయవాదులతో లోతుగా చర్చించినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం చర్యల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యూహాలపైనా బీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా పలు కోణాల్లో విస్తృతంగా చర్చించారు. తదుపరి ఏం చేయాలనే అంశంపై కీలక కసరత్తు చేశారు. కేసులో కేటీఆర్ అరెస్టును అడ్డుకునే విధంగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని భవిష్యత్ ప్రణాళికపై ఆంతరంగికంగా చర్చించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ కు మద్దతు తెలుపుతూ ఎంతో ఉత్కంఠతో బీఆర్ఎస్ శ్రేణులు నందినగర్ కు చేరుకున్నాయి.

Tags:    

Similar News