అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చి ఇందిరా క్యాంటిన్లుగా నామకరణం చేయాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇందిరా క్యాంటీన్లో రూ.5 భోజనంతో పాటూ టిఫిన్స్ కూడా పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం అన్నపూర్ణ క్యాంటీన్లకు శాశ్వత నిర్మాణాలు లేకపోవడంతో శాశ్వత నిర్మాణాల పునరుద్ధరణకు కమిటీ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 373 అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి. వీటిలో 53 కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడంతో మూతపడ్డాయి. ప్రస్తుతం 320 కొనసాగుతున్నాయి. వీటితో దాదాపు ప్రతిరోజూ 40వేల మందికిపైగా రూ.5 భోజనం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం భోజనం పెట్టగా క్యాంటీన్ పేరు మార్చి రూ.5కే ఇడ్లీ, వడ, ఉప్మా, టమాట బాత్ లాంటితో అల్పాహారం వడ్డించాలని నిర్ణయించింది.