PVP పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మరో ఫిర్యాదు..!
ప్రముఖ వ్యాపారవేత్త PVP పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మరో ఫిర్యాదు నమోదైంది.;
ప్రముఖ వ్యాపారవేత్త PVP పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మరో ఫిర్యాదు నమోదైంది. PVP తన అనుచరులను పంపి తమపై వేధింపులకు దిగుతున్నారని శ్రుతిరెడ్డి అనే మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. PVP అనుచరులు తమ కమ్యూనిటీలోకి అక్రమంగా ప్రవేశించి కాంపౌండ్ వాల్ ను డ్రిల్లింగ్ మిషన్లతో కూల్చారని, గోడలపై ఉన్న రేకులు కూడా తొలగించారని శ్రుతిరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా PVP, ఆయన అనుచరులపై పోలీసులు ఐపీసీ 447, 427, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.