Charla Palli Railway Terminal : హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. చర్లపల్లి టెర్మనల్ ప్రారంభం

Update: 2025-01-06 10:15 GMT

హైదరాబాద్ మహానగర పరిధిలోని చర్ల పల్లి రైల్వేటర్మినలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ రైల్వే టర్మినల్ ను ప్రధాని మోదీ వర్చువల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హైదరాబాద్ మహా నగరంలోని జీవించేందుకు తరలి వస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ ను అభి వృద్ధి పరచడం ద్వారా నగరంలోని ఇతర రైల్వే స్టేషన్ల పై ఒత్తిడి తగ్గుతోందని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం వందలాది కోట్లతో ఈ రైల్వే టర్మినల్న రైల్వే శాఖ అభివృద్ధి పరిచింది. అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో చర్లపల్లి రైల్వే టర్మినలు అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ నుంచి 24 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇక ఈ టెర్మినల్ గూడ్స్ రైళ్లకు సైతం మరో రకంగా ఉపయోగపడనుంది. అంటే... హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా గూడ్స్ రైళ్లు ఇక్కడి నుంచి నడవనున్నాయి. రూ.428 కోట్లతో చర్లపల్లి రైల్వేస్టేషన్ను అభివృద్ధి పరిచారు. ఐదు లిఫ్టులతోపాటు, ఐదు ఎస్కలేటర్లను సైతం ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేశారు. అలాగే పార్సిల్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు.

Tags:    

Similar News