Asaduddin Owaisi : నియోజకవర్గ అభివృద్ధి కోసమే కేటీఆర్‌ను కలిశా : ఓవైసీ
Asaduddin Owaisi : యూపీ ఫలితాలు ఆశ్చర్యపరచలేదని, అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తామన్నారు ఎంఐఎం అధినేత;
Asaduddin Owaisi : యూపీ ఫలితాలు ఆశ్చర్యపరచలేదని, అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తామన్నారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. యూపీలో బీజేపీ 80-20 ఫార్ములాతో విజయం సాధించిందని చెప్పారు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌తో ఆయన భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసమే కేటీఆర్‌ను కలిశానని, పార్లమెంట్‌లో మండలి పదవులు విషయం చర్చించలేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో లేవనెత్తతిన అంశాలపై కూడా మాట్లాడినట్లు చెప్పారు. తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు బీజేపీ చెబుతున్నా, యూపీ ఫలితాల ప్రభావం ఇక్కడ ఉందన్నారు. ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారని చెప్పారు.