ఖానాపూర్ అటవీ శాఖ కార్యాలయంపై దాడి
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో అటవీ శాఖ కార్యాలయంపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది.. ఈ ఘటనలో ఆఫీసు..;
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో అటవీ శాఖ కార్యాలయంపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది.. ఈ ఘటనలో ఆఫీసు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి.. ఉడుములను మార్కెట్‌లో విక్రయిస్తున్నాడన్న ఆరోపణలపై నాలుగు రోజుల క్రితం ఓ వ్యక్తిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.. అయితే, అధికారులు చితకబాదడంతో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉంది.. ఆగ్రహంతో బాధితుడి బంధువులు అటవీ కార్యాలయంపై దాడిచేసినట్లుగా తెలుస్తోంది.