వినాయకనగర్‌లో టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలు పై దాడి!

రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ నేతపై దాడి జరిగింది. వినాయక నగర్‌లో నివాసం ఉంటున్న టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలు చైతన్య రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.;

Update: 2020-12-20 06:49 GMT

రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ నేతపై దాడి జరిగింది. వినాయక నగర్‌లో నివాసం ఉంటున్న టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలు చైతన్య రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో చైతన్య రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.. ఇంట్లో ఫర్నీచర్‌ ధ్వంసంమైంది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు పిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్నారు మైలార్‌దేవుపల్లి పోలీసులు. నిన్న బీజేపీ-టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య ఘర్షణ ఘటన మరువకముందే మరో దాడి జరగడం కలకలం రేపుతోంది. గ్రేటర్‌ ఎన్నికల సమయం నుంచీ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది..

Tags:    

Similar News