బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ లాగా చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్చేస్తున్నామని తెలిపారు. చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'మేము 15 రోజులు సభ పెట్టా లని అడిగాం. కానీ వాళ్లు నాలుగైదు రోజులే నడిపే మూడ్ లో ఉన్నారు. మీరు కేవలం సలహా మాత్రమే ఇవ్వాలని సీఎం అంటున్నారు. లగచర్లపైన చర్చకు పట్టుపట్టినం. రైతులకు బేడీలు వేసిన అంశం మాకు చాలా కీలకం. దీనిపై ఏమీ తెల్చకపోవడంతో బయటకు వచ్చినం. ఇదే విషయంపై ఎంఐఎం కూడా వాకౌట్ చేసింది. ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్ కు చెప్పాం. బీఏసీ పెట్టకుండానే బిల్స్ ఎలా పెడతారు? పెండ్లిలు ఉన్నాయని సభ పెట్టకపో వడం ఏంటీ. కనీసం 15 రోజులు సభ నడపాలి. ప్రతిరోజూ జీరో అవర్ పెట్టాలి. టీ షర్ట్ లతో ఎందుకు రానియ్యలేదని గట్టిగా అడిగినం. మీ నాయకుడు రాహుల్ గాంధీ టీ షర్ట్ లతో వెళ్లాడు కదా అని గుర్తు చేశాం' అని తెలిపారు.