రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2గా ఉన్న
మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గుండె సంబంధిత చికిత్స కోసం బెయిల్ ఇవ్వాలని భుజంగరావు అప్పీల్ చేయగా.. కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.అయితే, బెయిల్ నేపథ్యంలో పలు షరతులను విధించింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని భుజంగరావును కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ఏడాది మార్చి23న భుజంగరావుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అమెరికాలోనే ప్రభాకర్ రావు..
ఈ కేసులో కీలక నిందితుడు ఏ 1 ప్రభాకర్‌రావు అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఏ6 శ్రవణ్‌కుమార్ పరారీలో ఉన్నారు. ఆయన దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణాలతో తాను అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని, కోలుకున్న తర్వాత వస్తానని ప్రభాకర్‌రావు తెలిపిన విషయం తెలిసిందే.