SAD: బలగం మొగిలయ్య కన్నుమూత

Update: 2024-12-19 02:45 GMT

పచ్చని సంసారమురా నా కొడుక.. చెడగొట్టుకోవద్దురా నా కొడుక.. అంటూ బలగం సినిమాలో అందరిని కంటతడి పెట్టించిన మొగిలయ్య కన్నుమూశారు. బలగం సినిమా ద్వారా పాపులర్ అయిన జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీలు ఫెయిల్యూరై.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరక్టర్‌‌ వేణు యెల్ధండి, చిత్ర యూనిట్ తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది.

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో విడుదలై సంచలన విజయం సాధించిన బలగం సినిమాలోని క్లైమాక్స్ లో భావోద్వేగభరితమైన పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. ఈ సినిమాతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్లుగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితోపాటు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం చికిత్స అందించింది. హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించారు. ఆతర్వాత బలగం సినిమా డైరెక్టర్ వేణుతోపాటు, మెగాస్టార్ చిరంజీవి సైతం ఆయనకు ఆర్థిక సాయం చేశారు.

Tags:    

Similar News