కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకు వెళ్లడం ఖాయం: బండి సంజయ్
కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్‌కు భయం అంటే ఏంటో చూపిస్తానని హెచ్చరించారు.;
కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్‌కు భయం అంటే ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ రంగు ఏంటో తెలిసిందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్... ఇంట్లో మాత్రం ఉద్యోగాలు భర్తీ చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టిమల్లలో మహేందర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోగా... అతడి కుటుంబ సభ్యుల్ని, హైదరాబాద్‌లో యాక్సిడెంట్‌కు గురై కోలుకుంటున్న లక్ష్మణ్‌ను బండి సంజయ్ పరామర్శించారు.