Bandi Sanjay : రెండ్రోజులు ఢిల్లీలో ఉన్నా కేసీఆర్‌ను ఎవరు పట్టించుకోలేదు : బండి సంజయ్
Bandi Sanjay : సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.;
Bandi Sanjay (tv5news.in)
Bandi Sanjay : సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండ్రోజులు ఢిల్లీలో ఉన్నా కేసీఆర్‌ను ఎవరు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ఇంట్లో లొల్లి అయిన ప్రతిసారి దేశ రాజకీయాలు అంటూ ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించారు. అవినీతి మంత్రిని కాపాడేందుకే బీజేపీని బద్నాం చేస్తున్నారని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు.