Bandi sanjay : నిజమైన ఉద్యమకారులు టీఆర్‌ఎస్‌లో లేరు : బండి సంజయ్
బైపోల్ వ్యూహంపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన.. TRSపై తీవ్ర విమర్శలు చేశారు.;
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో BJP గెలుపు ఖాయమన్నారు బండి సంజయ్. బైపోల్ వ్యూహంపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన.. TRSపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో TRS గడీలు బద్దలుకొట్టేది BJPయేనని చెప్పారు. నిజమైన ఉద్యమకారులెవరూ ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో లేరని, బ్లాక్‌టికెట్లు అమ్మేవాళ్లు, బ్లాక్‌మెయిల్ చేసే వాళ్లు కేబినెట్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు. అటు, BJPలో చేరిన తర్వాత తొలిసారి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఈటలె.. నియోజకవర్గంలో వ్యూహప్రతివ్యూహాలపై చర్చించారు.