బీజేపీ అంటే టీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుంది: బండి సంజయ్
ప్రజలను మోసం చేయడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.;
ప్రజలను మోసం చేయడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తెలంగాణ బీజేపీ ఎంపీలు.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.. ఎన్నికలు వచ్చాయంటే ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త కొత్త పథకాలు తెస్తారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఫేక్, పథకాలు ఫేక్.. అసలు పాలనే ఫేక్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
బీజేపీ నేతల అరెస్టులపైనా బండి సంజయ్ మండిపడ్డారు.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తే 144 సెక్షన్ పెట్టుకోవాల్సిన దుస్థితికి ప్రభుత్వం దిగజారిందని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న ఈ ప్రభుత్వం.. బీజేపీ అంటే భయం పట్టుకుందని విమర్శించారు.
ఎట్టి పరిస్థిల్లో దళితుల కోసం బీజేపీ ధర్నా నిర్వహించి తీరుతుందని మరో ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు.. అరెస్టులతో అడ్డుకోలేరన్నారు. ధర్నా చౌక్‌లో కాంగ్రెస్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు అరవింద్.