Bandi sanjay : పాతికేళ్ల భవిష్యత్తుకు అద్దం పట్టేలా బడ్జెట్ : బండి సంజయ్
Bandi sanjay : బడ్జెట్ విప్లవాత్మకం అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. పాతికేళ్ల భవిష్యత్తుకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉందన్నారు.;
Bandi Sanjay (tv5news.in)
Bandi sanjay : బడ్జెట్ విప్లవాత్మకం అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. పాతికేళ్ల భవిష్యత్తుకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలపై భారం మోపకపోవడం సాహసోపేత నిర్ణయమని కొనియాడారు. రాజకీయాలతో సంబంధం లేకుండా దేశహితం కోసం బడ్జెట్ రూపొందించారన్నారు బండి సంజయ్. MSMEలకు 6 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వడంతో... కోట్లాది మంది యువతకు ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. అన్నిరంగాలను సమదృష్టితో చూడటం కత్తిమీద సామే అన్నారు. అలాంటిది అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ రూపొందించడం గర్వకారణం అన్నారు బండి సంజయ్.