Bandi Sanjay : గ్రూప్ 1 వివాదంపై కమిషన్ ను వివరణ కోరిన బండి సంజయ్

Update: 2025-05-01 06:00 GMT

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల వ్యవహారంపై నెలకొన్న వివాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ పరీక్షల నిర్వహణ తీరుపై సమగ్ర సమాచారాన్ని వారం రోజుల్లోగా అందించాలని కోరుతూ ఆయన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. గ్రూప్-1 పరీక్షల ప్రక్రియలో అవకతవకలు, లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ అభ్యర్థులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రూప్-1 పరీక్షల విషయంలో తమకు అనేక సందేహాలున్నాయని, అవినీతి, అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు అభ్యర్థులు ఇటీవల బండి సంజయ్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న బండి సంజయ్, ఈ మేరకు టీజీపీఎస్సీకి లేఖ రాశారు. అభ్యర్థులు లేవనెత్తిన ప్రధాన సందేహాలను, ఆరోపణలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను వారం రోజుల్లోగా అందజేయాలని టీజీపీఎస్సీ చైర్మన్‌ను కోరారు.

Tags:    

Similar News