Bandi Sanjay: కేసీఆర్‌ది దొంగ ప్రభుత్వం: బండి సంజయ్
Bandi Sanjay: కేసీఆర్‌ది దొంగ ప్రభుత్వమని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్.;
Bandi Sanjay: కేసీఆర్‌ది దొంగ ప్రభుత్వమని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్.. లింగోజిగూడెంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఏ భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలియదని, పేదల భూములను తన పేరు మీద మార్చుకునేందుకే కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చారని అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదల భూములు పేదలకు పంచిపెడతామని హామీ ఇచ్చారు బండి సంజయ్.వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్ తన ఫాంహౌస్‌లో ఎందుకు వరి పంట వేశాడని ప్రశ్నించారు బండి.వరి ధాన్యం కొనుగోలు కోసం ప్రతి పైసా మోడీనే ఇస్తున్నారని,ఇక్కడ కేసీఆర్ డబల్ బెడ్ రూంలు అని చెప్పి కొంపలు ముంచుతున్నారని మండిపడ్డారు బండి సంజయ్.