బండి సంజయ్.... టెలికాన్ఫరెన్స్
మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
దేశ సమగ్ర అభివృద్ధే బీజేపీ లక్ష్యమని బండి సంజయ్ అన్నారు. పలు జిల్లాల బీజేపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బండి సంజయ్.. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు గడప గడపకు బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.
ఇక అమిత్ షా, నడ్డాను చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు.రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏ నేతలతోనైనా భేటీకి బీజేపీ అగ్రనాయకులు సిద్ధమని.. కేసీఆర్ మాదిరిగా ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం కామన్నారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే నైజం బీజేపీది కాదన్న బండి సంజయ్... తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలంతా కలిసి పోటీ చేయబోతున్నాయని.. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్‌ను గద్దెదించడం ఖాయమని బండి సంజయ్ అన్నారు.