Abudhabhi Bathukamma : అబుదాబిలో బతుకమ్మ సంబరాలు..
Abudhamma Bathukamma : బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రవాస తెలంగాణవారు.;
Abudabhi Bathukamma : బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రవాస తెలంగాణవారు... కన్నుల పండువగా నిర్వహించుకుంటున్నారు. దీనిలో భాగంగా అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణా సంస్కృతిలో భాగమైన బతుకమ్మ సంబరాలకోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న తెలంగాణ వారు.. దేశరాజధాని అబుదాబికి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కళ తెచ్చేందుకు ప్రముఖ కవి గాయకుడు సాయి చాంద్ తోపాటు.. గాయకురాలు వరం తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి యూఏఈ భారత రాయబార కార్యాలయం కౌన్సిలర్ బాలాజీ రామస్వామి ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.