Dubai Bathukamma : దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
Dubai Bathukamma : దుబాయ్‌లోని తెలంగాణ ప్రవాసీయుల ప్రప్రథమ సంఘమైన గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించింది;
Dubai Bathukamma : దుబాయ్‌లోని తెలంగాణ ప్రవాసీయుల ప్రప్రథమ సంఘమైన గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించింది. గత మూడేళ్లుగా కరోనా, ఆర్థిక మాంద్యం కారణంగా నిరాడంబరంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలను మళ్లీ ఈసారి నూతనోత్తేజంతో నిర్వహించారు. తెలంగాణ ప్రవాసీయులకు అనువుగా ఉండే విధంగా అల్ అహ్లీ స్టేడియంలో జి.టి.డబ్ల్యూ.సి.ఏ నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
బతుకమ్మ ఒక వేడుక మాత్రమే కాదు, తమ అస్తిత్వానికి ప్రతీక అని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్‌కు చెందిన జె.సౌమ్య రాణి చేసిన వ్యాఖ్యలతో పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన సుద్దాల విజేత ఏకీభవించారు. బతుకమ్మ అంటే ఇప్పుడు గౌరవంతో కూడుకుందని.. వరంగల్ నగరానికి చెందిన రేవూరి సబితా రెడ్డి అన్నారు. దుబాయ్ బతుకమ్మ సంబురాల నిర్వహణలో నాగమణి దామోర, విజేత, జ్యోతి, సబితా, ప్రియా, అవంతిక, భారతీ, శ్రీవాణి, ఉషా ప్రియాంక, ఉపాసన కీలక పాత్ర పోషించారు. జి.టి.డబ్ల్యూ.సి.ఏ బాధ్యులు జువ్వాడి శ్రీనివాసరావు, సలాఓద్దీన్, సామ్యూల్, కటుకం రవి, మల్లేశ్‌లు ఏర్పాట్లను పర్యవేక్షించారు.