TG : బావా కలిసి పనిచేద్దాం.. కేటీఆర్, హరీశ్ భేటీలో కీలక నిర్ణయం

Update: 2025-05-17 05:46 GMT

బీఆర్ఎస్ కలహాల కాపురంగా మారిందన్న విషప్రచా రాన్ని తిప్పికొడదామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు, మాజీ మంత్రి టి. హరీష్ రావు నిర్ణయించారు. పార్టీ ముఖ్య నేతల మధ్య అంత రాలు పెరిగాయని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు.

శుక్రవారం హరీష్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్ళారు. రెండు గంటల పాటు బావ బావ మరది చర్చలు జరపడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాధారణ సమయంలో బావ బావమరది కలుసుకుంటే అందులో విశేషమేమీ ఉండదు. కానీ పార్టీలో వీరిమధ్య అంతరాలు తారాస్థాయికి చేరాయన్న ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో బావ ఇంటికి కేటీఆర్ వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకున్నది. పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు సూచన మేరకే కేటీఆర్, బావ హరీష్ నివాసానికి వెళ్ళారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తన నివాసానికి విచ్చేసిన కేటీఆర్ ను హరీష్ సాధారంగా ఆహ్వానించారు. అనంతరం ఇరువురూ అనేక అంశాలపై చర్చించారు. పార్టీనేతల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వారివురు భావించారు.

తెలంగాణ భవన్ లో లేదా అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహింస్తే సరిపోదని, ప్రజల మధ్యకు వెళ్ళాలని, రైతులను కలుసుకోవాలని, కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏ మేరకు అమలు అవుతున్నదో స్వయంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని వారు ఈ సందర్భంగా చర్చించారు. 

Tags:    

Similar News