తెలంగాణలో బీసీ బంధు అమలు చేయాలి.. వీహెచ్ డిమాండ్
తెలంగాణలో దళిత బంధు తరహాలోనే బీసీ బంధు అమలు చేయాలని రాజ్యసభ కాంగ్రెస్ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు.;
VH hanumantharao
తెలంగాణలో దళిత బంధు తరహాలోనే బీసీ బంధు అమలు చేయాలని రాజ్యసభ కాంగ్రెస్ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. బీసీలలో చాలామంది పేదలు ఉన్నారని తెలిపారు. అందరికీ న్యాయం జరిగేలా పెద్దఎత్తున ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. యూపీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ.. పార్లమెంట్‌లో ఓబీసీ బిల్లు ప్రవేశపెట్టారని విమర్శించారు. ఓబీసీ బిల్లులో కొత్తదనమేముందని ప్రశ్నించారు. కేంద్రం దమ్ముంటే కులాల వారీగా రిజర్వేషన్‌లు పెట్టాలని సవాల్ విసిరారు.