Raja Singh Arrest : బేగంబజారులో షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేసిన వ్యాపారులు..
Raja Singh Arrest : ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌ను నిరసిస్తూ బేగంబజారులో స్వచ్చందంగా బంద్ నిర్వహించారు వ్యాపారులు.;
Raja Singh Arrest : ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌ను నిరసిస్తూ బేగంబజారులో స్వచ్చందంగా బంద్ నిర్వహించారు వ్యాపారులు. బేగంబజారు, గన్‌ఫౌండ్రీ తదితర ప్రాంతాల్లో షాపులు మూసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను తగలబెట్టారు రాజాసింగ్ అనుచరులు. గోషామహాల్ వ్యాప్తంగా పలు దుకాణాలు,హోటళ్లు,పెట్రోల్ పంపులు మూసివేశారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు.